Pawan Kalyan: చంద్రబాబుపై పవన్ సెటైర్

  • రాహుల్ కు బాబు కన్నుకొట్టి మనం ఒకటే అనగలరు! 
  • అమరావతి పెయింటింగ్స్ కే పరిమితమైంది
  • నిజమైన అమరావతిని మేము నిర్మిస్తాం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘2013 భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సు’ను విజయవాడలో ఈ రోజు నిర్వహించిన సంగతి విదితమే. ఈ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కనిపిస్తే, ఆయనకు చంద్రబాబు కన్నుకొట్టి 'మనిద్దరం ఒకటే' అనగలరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం అమరావతి పెయింటింగ్స్ కే పరిమితమైందని, భవిష్యత్ లో ‘జనసేన’, వామపక్షాల సారథ్యంలో నిజమైన అమరావతిని నిర్మిస్తామని ధీమాగా చెప్పారు.  

More Telugu News

Pawan Kalyan
Rahul Gandhi