Chandrababu: చంద్రబాబు సీటు ఇవ్వలేదని టీడీపీ నుంచి బయటకు వచ్చారా?: పవన్ పై అంబటి సెటైర్లు

  • అసెంబ్లీలో ఉంటే ఊపు ఊపేవాడినన్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి
  • చనిపోవాలనుకున్న వ్యక్తిని ధైర్యవంతుడు అంటారా?
  • వ్యక్తిగత అంశాల గురించి ప్రశ్నిస్తే.. భయమెందుకు?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. నాలుగేళ్ల పాటు టీడీపీతో అంటకాగిన పవన్... ఇప్పుడు టీడీపీని వదిలి, వైసీపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాదిరే పవన్ కూడా మాట్లాడుతున్నారని... తనకు తానే ఉత్తముడినంటూ కితాబిచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

తాను అసెంబ్లీలో ఉంటే ఒక ఊపు ఊపేవాడినంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అంబటి అన్నారు. చంద్రబాబు రాజ్యసభ సీటు ఇస్తానంటే ఎన్నికల్లో పోటీ చేయలేదని పవన్ చెప్పారని... ఇప్పుడు సీటు ఇవ్వనందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చారా? అని ప్రశ్నించారు. ఒకనొక సమయంలో రివాల్వర్ తో కాల్చుకుని చావాలనుకున్నానని సభల్లో పవన్ చెబుతున్నారని... జీవితంలో పోరాడలేక చావాలనుకున్న వ్యక్తిని ఎవరైనా ధైర్యవంతుడు అంటారా? అని ప్రశ్నించారు.

ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబుకు ఎందుకు మద్దతు పలికారో పవన్ చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. వ్యక్తిగత అంశాల గురించి ప్రశ్నిస్తే పవన్ ఎందుకు భయపడుతున్నారని అన్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. తన మాటలను పవన్ అదుపులో పెట్టుకోవాలని సూచించారు. 
Chandrababu
pawan kalyan
ambati rambabu

More Telugu News