karunanidhi: కరుణానిధిని పరామర్శించిన నిర్మలా సీతారామన్

  • కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి
  • కరుణానిధికి అందుతున్న వైద్యసేవలపై మంత్రి ఆరా
  • కార్యకర్తలు ఆందోళన చెందవద్దన్న కనిమొళి
చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు. కరుణానిధికి అందుతున్న వైద్యసేవల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు, కరుణానిధిని గవర్నర్ పురోహిత్, సీఎం పళనిస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తదితరులు పరామర్శించారు. కరుణానిధికి మెరుగైన వైద్యం అందుతోందని పళనిస్వామి చెప్పారు.

 కాగా, గత రెండ్రోజులుగా జ్వరం, ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న కరుణానిధికి గోపాలపురంలోని ఆయన నివాసంలోనే వైద్యుల బృందం ట్రీట్ మెంట్ చేసింది. అయితే, ఆయన కోలుకోకపోవడంతో నిన్న అర్ధరాత్రి కావేరి ఆసుపత్రికి తరలించారు. తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉందని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కరుణానిధి కూతురు, డీఎంకే ఎంపీ కనిమొళి చెప్పారు.
karunanidhi
nirmala sitaraman

More Telugu News