Actress: పోలీసులు నన్ను లైంగికంగా వేధించారు: తమిళ సహాయ నటి శ్రుతి ఆరోపణ

  • కండిషనల్ బెయిలుపై విడుదలైన శ్రుతి
  • పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక
  • తానెవరినీ మోసం చేయలేదన్న సహాయనటి
పెళ్లి పేరుతో కోటీశ్వరులను మోసగించిన కేసులో అరెస్ట్ అయిన కోలీవుడ్ సహాయ నటి శ్రుతి సంచలన ఆరోపణలు చేసింది. పోలీసులు తనను లైంగికంగా వేధించారని, ఈ విషయం ఫిర్యాదు చేస్తానని పేర్కొంది. ప్రస్తుత కేసులో విచారణ ముగిసిన వెంటనే తనను వేధించిన పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపింది.

వివాహం ఆశ చూపించి ఎన్‌ఆర్ఐలు, కోటీశ్వరులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను బుట్టలో వేసుకున్న శ్రుతి ఒకరికి తెలియకుండా ఒకరి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజినట్టు ఆరోపణలున్నాయి. ఆమె వలలోపడి మోసపోయినట్టు ఒకరి తర్వాత ఒకరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సహాయనటి శ్రుతి, ఆమె తల్లి చిత్ర సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో శుక్రవారం ఆమె కండిషనల్ బెయిలుపై విడుదలైంది. అనంతరం విలేకరులతో మాట్లాడింది. పెళ్లి పేరుతో తాను ఎవరినీ మోసం చేయలేదని పేర్కొంది. విచారణ సందర్భంగా పోలీసులు తనను లైంగికంగా వేధించారని, వారిపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తానని తెలిపింది.
Actress
Shruthi
Tamilnadu
Kollywood
Marriage

More Telugu News