Rahul Gandhi: సెక్షన్ 377ను ఇంకా రద్దు చేయలేదు.. రాహుల్‌ను మేం హత్తుకోం!: బీజేపీ ఎంపీ

  • ఆయనను హగ్ చేసుకుంటే మాకు విడాకులు ఖాయం
  • స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ ఇంకా రద్దు కాలేదు 
  • రాహుల్ పెళ్లి చేసుకుంటే కనుక ఓకే
రాహుల్ గాంధీ హగ్‌పై బీజేపీ నేతల దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ను కనుక హగ్ చేసుకుంటే తమకు విడాకులు తప్పవన్నారు. దేశంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 377ను ఇంకా రద్దు చేయలేదని, కాబట్టి రాహుల్‌ను హత్తుకుంటే చిక్కుల్లో పడతామని వ్యంగ్యంగా అన్నారు. రాహుల్ పెళ్లి చేసుకుంటే ఆయనను హత్తుకోవడానికి తమకు ఎటువంటి అభ్యంతరం ఉండదని, కానీ , ఇప్పుడు హత్తుకుంటే తమ భార్యలు విడాకులిచ్చేస్తారని చమత్కరించారు.  

అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్‌సభలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చర్చ ముగించి ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ హగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అవకాశం దొరికినప్పుడల్లా హగ్ గురించి మాట్లాడుతూ రాహుల్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Rahul Gandhi
Congress
BJP
Nishikanth dube

More Telugu News