Tamilnadu: స్టాలిన్... నాన్నకు ఎలా ఉంది?: నరేంద్ర మోదీ వాకబు

  • కరుణానిధికి తీవ్ర అనారోగ్యం
  • స్టాలిన్, కనిమోళిలకు ఫోన్ చేసిన మోదీ
  • ఏ సాయం కావాలన్నా చేస్తానని హామీ
డీఎంకే అధినేత, భారత రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం ఇంట్లో చికిత్స చేయించుకుంటున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కరుణ కుమారుడు స్టాలిన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి పరామర్శించారు. ఈ ఉదయం ఫోన్ లో మాట్లాడిన ప్రధాని, కరుణానిధి ఆరోగ్యంపై ఆరా తీశారు. కరుణానిధి కుమార్తె కనిమోళితోనూ మోదీ సంభాషించారు.

ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసిన మోదీ, కరుణానిధికి అవసరమైన వైద్యంపై ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమని తెలిపానని అన్నారు. ఆయన వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నానని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
Tamilnadu
Karunanidhi
Stalin
Narendra Modi

More Telugu News