Independents: సీఎంను మార్చారో.. ఇక మేం బయటకెళ్లిపోతాం!: బీజేపీని హెచ్చరించిన మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యేలు

  • మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏడుగురు స్వతంత్రుల మద్దతు
  • ఫడ్నవిస్‌ను మార్చే యోచనలో బీజేపీ ఉందన్న శివసేన
  • అలాగైతే బయటకొచ్చేస్తామన్న రవి రాణా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను మార్చాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లిపోతామని స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ అధిష్ఠానాన్ని హెచ్చరించారు. ఫడ్నవిస్ సామర్థ్యం కలిగిన ముఖ్యమంత్రి అని, ఆయనను మార్చాలని చూస్తే ఊరుకోబోమని స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణా పేర్కొన్నారు. అదే జరిగితే తనతో సహా మరో ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఫడ్నవిస్ అయితేనే మరాఠా, ధంగర్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించగలరని, ఆయనకు మాత్రమే ఆ సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని మార్చాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రిని మార్చేందుకు బీజేపీలో చర్చలు జరుగుతున్నట్టు శివసేన చెప్పడంతో రవి రాణా ఈ హెచ్చరికలు చేశారు.
Independents
Fadnavis
Maharashtra
Ravi Rana

More Telugu News