Allu Arjun: డియర్ ఫ్యాన్స్... ఓపికగా ఉండండి: అల్లు అర్జున్

  • 'నా పేరు సూర్య' తరువాత మరో చిత్రం ప్రకటించని బన్నీ
  • ఫ్యాన్స్ లో ఎడతెగని చర్చ
  • ట్విట్టర్ లో స్పందించిన హీరో
'నా పేరు సూర్య' చిత్రం తరువాత, మెగా హీరో అల్లు అర్జున్ మరో సినిమాను ఇంకా ఎనౌన్స్ చేయలేదన్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో నెక్ట్స్ మూవీ ఏంటన్న విషయమై అల్లు ఫ్యాన్స్ లో చర్చ సాగుతున్న వేళ, తన ట్విట్టర్ ఖాతా ద్వారా బన్నీ స్పందించాడు.

"మై డియర్ ఫ్యాన్స్... మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నా తదుపరి సినిమా ప్రకటన గురించి ఓపికగా ఉండమని కోరుతున్నాను. ఎందుకంటే అది ఇంకాస్త సమయాన్ని తీసుకోవచ్చు. ఓ మంచి చిత్రాన్ని మీకందించాలని చూస్తున్నాను. కొంత సమయం పడుతుంది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి ఓకే చెప్పేందుకు మరింత సమయం తీసుకోనున్నాడని అర్థమవుతోంది.
Allu Arjun
Next Movie
Time
Patient

More Telugu News