Imran khan: ఇమ్రాన్ పాక్ ప్రధాని కాబోతున్న వేళ.. మాజీ భార్య ట్వీట్!

  • మాజీ భర్తకు జెమీమా అభినందనలు
  • ఎన్నో త్యాగాల తర్వాత ప్రధాని అయ్యారన్న జెమీమా
  • నా బిడ్డల తండ్రి ప్రధాని కాబోతున్నారంటూ ట్వీట్
పాక్ నూతన ప్రధాని కాబోతున్న ఇమ్రాన్ ఖాన్‌కు ఆయన మాజీ భార్య జెమీమా ఖాన్‌ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఎన్నో త్యాగాలు చేసిన నా బిడ్డల తండ్రి మొత్తానికి ప్రధాని కాబోతున్నారంటూ ఆమె చేసిన ట్వీట్ వైరల్ అయింది. 1997లో తొలిసారి ఆయన ఎన్నికల బరిలోకి దిగిన రోజులు తనకింకా గుర్తున్నాయని పేర్కొన్న జెమీమా.. అప్పట్లో ఫలితాల కోసం ఎంతగానో ఎదురుచూసినట్టు పేర్కొన్నారు.

చివరికి ఫోన్ వచ్చిందని, అది మాట్లాడిన తర్వాత ఇమ్రాన్ ఆనందంతో పగలబడి నవ్వారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తర్వాత ప్రధాని కాబోతున్న ఇమ్రాన్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చిందీ గుర్తుంచుకోవడమే ఆయన ముందున్న అతిపెద్ద సవాలని పేర్కొన్నారు. 1995లో ఇమ్రాన్‌ను పెళ్లి చేసుకున్న జెమీమా 2005లో విడాకులు ఇచ్చారు. అయినప్పటికీ ఇమ్రాన్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.  
Imran khan
Pakistan
Jemima goldsmith
Prime Minister

More Telugu News