Hyderabad: రెడ్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి... రాత్రి పూట ఒంటరిగా తిరిగిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్!

  • కార్యాలయం నుంచి ఇంటివరకూ కాలినడకన
  • రాత్రి పరిస్థితులు తెలుసుకునేందుకే
  • మార్గమధ్యంలో వ్యాపారులతో మాటా మంతీ
హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ గత రాత్రి బషీర్ బాగ్ లోని తన కార్యాలయం నుంచి అంబర్ పేటలోని ఇంటివరకూ దాదాపు 5 కిలోమీటర్ల దూరాన్ని, సెక్యూరిటీ సిబ్బంది లేకుండా నడుచుకుంటూ వెళ్లారు. రాత్రి సమయాల్లో నగరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకే ఆయన ఈ పని చేశారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిని రావద్దని వారించిన ఆయన, బషీర్‌ బాగ్‌, హిమాయత్‌ నగర్‌, నారాయణగూడ, తిలక్‌ నగర్‌, అంబర్‌ పేట మీదుగా ఇల్లు చేరుకున్నారు.

మార్గమధ్యంలో తనకు తారసపడిన ఒకరిద్దరు వీధి వ్యాపారులతో మాట్లాడి, వారి వ్యాపారం ఎలా సాగుతోందో ఆరా తీశారు. ఓ పండ్ల దుకాణం తెరచి ఉండటాన్ని చూసి, అక్కడి ధరలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ యూనిఫామ్ ను వదిలేసిన ఆయన, రెడ్ కలర్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి నడిచారు. మఫ్టీలో ఉండటంతో అంజనీ కుమార్ ను నగర పౌరులు పెద్దగా గుర్తించలేదు.
Hyderabad
Anjankumar Yadav
CP
Police

More Telugu News