dil raju: దిల్ రాజుకి డిస్కౌంట్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్!

  • దిల్ రాజు నుంచి 'శ్రీనివాస కళ్యాణం'
  • కీలకపాత్రలో ప్రకాశ్ రాజ్ 
  • ఇద్దరి మధ్య మంచి అనుబంధం  
విలక్షణ నటుడిగా ప్రకాశ్ రాజ్ కి మంచి పేరుంది. తెరపై తాను పోషించే పాత్ర తప్ప తాను కనిపించడానికి ఆయన ఇష్టపడడు. కథకు .. సన్నివేశాలకు బలం చేకూరాలంటే ప్రకాశ్ రాజ్ వుండవలసిందేనని దర్శక నిర్మాతలు భావిస్తుంటారు. అలా విభిన్నమైన పాత్రలను చేయడం వల్లనే ఆయన ప్రేక్షకుల మనసులకు బాగా చేరువైపోయారు. వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ వెళ్లే ఆయన, ఒక రోజుకు 5 లక్షల పారితోషికం తీసుకుంటారని టాక్.

 అలాంటి ప్రకాశ్ రాజ్ .. 'శ్రీనివాస కళ్యాణం' సినిమా కోసం రోజుకి 3 లక్షలు మాత్రమే తీసుకున్నారని వినికిడి. అయితే ప్రకాశ్ రాజ్ పారితోషికం తగ్గించుకున్నది .. ఆయనకి డిమాండ్ తగ్గడం వలన అనుకుంటే పొరపాటే. నిర్మాత దిల్ రాజుతో తనకి గల అనుబంధం కారణంగానే ప్రకాశ్ రాజ్ తక్కువ పారితోషికం తీసుకున్నారట. దిల్ రాజు తన ప్రతి సినిమాలోనూ ప్రకాశ్ రాజ్ కి కీలకమైన పాత్రలను ఇస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.     
dil raju
Prakash Raj

More Telugu News