surya: సూర్య మూవీ రిలీజ్ దీపావళికి లేనట్టే!

  • సెల్వ రాఘవన్ కి అస్వస్థత 
  • వాయిదా పడిన షెడ్యూల్స్ 
  • సూర్య జోడీగా రకుల్ .. సాయిపల్లవి    
ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య 'ఎన్ జీకే' సినిమా చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ .. సాయిపల్లవి కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సమయానికి ఈ సినిమా థియేటర్లకు రాకపోవచ్చనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. దర్శకుడి అనారోగ్యమే అందుకు కారణమని అంటున్నారు.

దర్శకుడు సెల్వరాఘవన్ మంచి అంకితభావం కలిగిన వ్యక్తిగా చెబుతారు. పక్కా ప్లానింగ్ తో ఆయన ముందుకు వెళుతుంటారు. అయితే 'ఎన్ జీకే' షూటింగు సమయంలో ఆయన బాగా అస్వస్థతకి లోనయ్యారు .. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందట. అందువలన ముందుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ ను వాయిదా వేసేశారు. ఈ కారణంగా ఈ సినిమా విడుదల దీపావళికి ఉండకపోవచ్చని అంటున్నారు. కాలేజ్ నేపథ్యంలో సాగే రాజకీయాలను చూపించే ఈ సినిమా కోసం, సూర్య అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.         
surya
rakul
sai pallavi

More Telugu News