Jagan: జగన్ ఇంటి ఆడపడుచులను వివాదంలోకి లాగొద్దు: ఫ్యాన్స్ కు పవన్ విన్నపం

షార్ట్స్‌లో చూడండి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు వ్యక్తిగత స్థాయికి మారడంతో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పోస్టులపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ ఈ వివాదంలోకి జగన్ మోహన్ రెడ్డి ఇంటి ఆడపడుచులను, కుటుంబ సభ్యులను లాగవద్దని విన్నవించారు.

 "ఈ మధ్యన జగన్ మోహన్ రెడ్డి నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన తీరు చాలా మందికి బాధ కలిగించిందని నా దృష్టికి వచ్చింది. నేను ఎవరి వ్యక్తిగతమైన జీవితాల్లోకి వెళ్లను. అది రాజకీయ లబ్ది కోసం అసలు వాడను. ప్రజలకు సంబంధించిన పబ్లిక్ పాలసీల మీదే మిగతా పార్టీలతో విభేదిస్తాను కానీ, నాకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు.

ఈ తరుణంలో ఎవరన్నా జగన్ మోహన్ రెడ్డిని కానీ, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను కానీ, వారి ఇంటి ఆడపడుచులను కానీ ఈ వివాదంలోకి లాగవద్దని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను. ఈ వివాదాన్ని దయచేసి అందరూ ఇక్కడితో ఆపివేయాల్సిందిగా నా ప్రార్థన" అని పోస్టు పెట్టారు.
Go Back to Shorts
Jagan
Pawan Kalyan
Jana Sena
YSRCP
Twitter

More Telugu News