Biggboss: బిగ్ బాస్ లోని తనీశ్ కు తల్లి ఫోన్... దీప్తి సునయనతో దగ్గరగా ఉండవద్దని వార్నింగ్!

  • కుటుంబ సభ్యులతో మాట్లాడిన కంటెస్టెంట్స్
  • తన తల్లికి ఫోన్ చేసిన తనీశ్
  • బయట పుకార్లు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిక
బిగ్ బాస్ హోస్ లో నిన్న కంటెస్టెంట్ లకు వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించిన వేళ, తనీశ్ తన తల్లితో మాట్లాడగా, ఆమె చెప్పిన మాటలు ఆసక్తికరంగా సాగాయి. హౌస్ లో దీప్తి సునయనకు క్లోజ్ గా ఉండవద్దని, బయట చాలా పుకార్లు వినిపిస్తున్నాయని ఆమె చెప్పారు. పిల్లలు, పెద్దలు అందరూ ఈ షోను చూస్తున్నారని, దీప్తికి దగ్గరగా ఉంటుంటే ఫ్యాన్స్ కు నచ్చడం లేదని, ఓట్లు రాలవని హితవు పలికారు. కోపంగా ఉండవద్దని హెచ్చరిస్తూ, షో వ్యాఖ్యాత నాని చెప్పినట్టు వినాలని సూచించారు. ఓట్లు వచ్చి, విజయం సాధించాలంటే, కోపం తగ్గించుకుని, సరదాగా ఉండాలని, చూస్తున్న ప్రేక్షకులకు నచ్చితే చాలని సలహా ఇచ్చారు తనీష్ తల్లి.
Biggboss
Taneesh
Contestents
Deepti Sunayana

More Telugu News