Sai Pallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సాయిపల్లవి చేయాల్సింది రాశిఖన్నాకు వెళ్లింది!  
  • 'లీడర్'కు సీక్వెల్ చేసే పనిలో రానా
  • రచయిత్రిగా మారిన నిత్యా మీనన్ 
  • అక్టోబర్ నుంచి కమల్-శంకర్ ప్రాజక్ట్   

*  తాజాగా రూపొందిన 'శ్రీనివాసకల్యాణం' చిత్రంలో కథానాయిక పాత్ర కోసం మొదట సాయిపల్లవిని అడిగారట. అయితే పాత్ర నచ్చకపోవడం వల్ల ఆమె తిరస్కరించిందని, దాంతో ఆ అవకాశం రాశిఖన్నాకు వెళ్లిందని చెబుతున్నారు.
*  రానా దగ్గుబాటి 2010లో 'లీడర్' చిత్రం ద్వారా టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన సంగతి విదితమే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చేసే ప్రయత్నంలో రానా వున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల సందర్భంగా దానిని విడుదల చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
*  కథానాయిక నిత్యా మీనన్ ఇప్పుడు రచయితగా కూడా మారింది. మలయాళంలో తాను నటిస్తున్న 'ప్రాణ' చిత్రానికి ఈ చిన్నది డైలాగులు రాస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఆమె నవలా రచయిత్రి పాత్రలో నటిస్తోంది.
*  కమలహాసన్, శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన 'భారతీయుడు' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ నుంచి జరుగుతుంది.
Sai Pallavi
Rashikhanna
Rana
Kamal Haasan

More Telugu News