Imran khan: ఇమ్రాన్‌ఖాన్‌కు పాక్ పీఠం.. లీడింగ్‌లో క్రికెటర్ పార్టీ!

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఇలాగే కొనసాగితే పాక్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ గద్దెనెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. పాక్ జాతీయ అసెంబ్లీకి బుధవారం ఎన్నికలు జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాన్ (పీటీఐ) పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 112 స్థానాల్లో పీటీఐ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ 65 స్థానాలు, పీపీపీ పార్టీ 43 స్థానాలతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.
Go Back to Shorts
Imran khan
Pakistan
Elections

More Telugu News