Rahul Gandhi: రాహుల్ కౌగిలింత వెనక కొత్త కోణం.. ఆరోపించిన బీజేపీ!

  • తాంత్రికుడి సలహాతోనే రాహుల్ హగ్
  • ఆరోపించిన బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధి
  • కాదేకాదంటున్న కాంగ్రెస్
ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన ‘హగ్’ మంటలు ఇంకా చల్లారడం లేదు. రాహుల్ ఆలింగనం వెనక ఉన్న అసలు కథ ఇదే అంటూ బీజేపీ సరికొత్త కోణాన్ని బయటపెట్టింది. ఓ తాంత్రికుడి సలహా మేరకు మోదీని రాహుల్ కౌగిలించుకున్నారని బీజేపీ ఢిల్లీ ప్రతినిధి తేజిందర్‌ పల్‌ సింగ్‌ బగ్గా ఆరోపించారు. ఈ విషయాన్ని తనకు సన్నిహితుడైన ఓ కాంగ్రెస్ ఎంపీ చెప్పారని పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రసంగించడం ముగియగానే ప్రధాని సీటును తాకాలని ఆ తాంత్రికుడు రాహుల్‌కు చెప్పాడని, దానిని ఆయన అమలు చేశారని అన్నారు. రాహుల్ ఆలింగనం వెనక ఉన్న అసలు రహస్యం ఇదేనని ఆయన వివరించారు.

కాంగ్రెస్ కథనం మాత్రం మరోలా ఉంది. బీజేపీ నాయకులు తనను, తన కుటుంబాన్ని ద్వేషించినా, ‘పప్పు’ అని విమర్శిస్తున్నా తాను మాత్రం ప్రేమిస్తూనే ఉంటానని చెప్పడానికే ఆయన ప్రధానిని ఆలింగనం చేసుకున్నారని చెబుతున్నారు. రాహుల్, సోనియాపై మోదీ విమర్శలు చేసినప్పుడే రాహుల్ మదిలో ఆలింగనం ఆలోచన పుట్టిందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.
Rahul Gandhi
Congress
Narendra Modi
BJP

More Telugu News