Pawan Kalyan: ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తాం: పవన్ కల్యాణ్ వార్నింగ్

షార్ట్స్‌లో చూడండి
ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామని, అలాంటి పోరాటమే కావాలనుకుంటే సిద్ధమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో తమ పార్టీ కార్యకర్తలతో పవన్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, విలువలతో కూడిన రాజకీయం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, ఎలాంటి భాష ఉపయోగించాలో తెలిసినవాడినని అన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలుపెడితే ఫ్యాక్షనిస్టు నాయకులు తట్టుకోలేరని, పారిపోతారని మండిపడ్డారు.

‘చంద్రబాబు, జగన్ లాంటి వాళ్లు రాజ్యాంగం రాయలేరు. అంబేద్కర్ లాంటి మహానుభావుడికే రాజ్యాంగం రాయగలిగే విజ్ఞానం ఉంటుంది. ఇసుక మాఫియా, కుంభకోణాలు, దోపిడీలు చేసే వీళ్లకే పిచ్చిపిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే.. ప్రజా సంక్షేమం కోసం నిలబడే నాకు ఎంత తెగింపు ఉండాలి? చూడ్డానికి పవన్ కల్యాణ్ మెత్తగా కనిపిస్తాడు కానీ, తేడా వస్తే తోలు తీస్తాడు. సమాజంలో మార్పు తీసుకొస్తున్నాననే భయంతోనే టీడీపీ, వైసీపీ, బీజేపీ అందరూ నన్ను తిడుతున్నారు' అని  అన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jagan

More Telugu News