aanand: హీరోగా విజయ్ దేవరకొండ బ్రదర్!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై తమ హవాను కొనసాగిస్తోన్న యువ కథానాయకులలో విజయ్ దేవరకొండ ఒకరు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను . . పాత్రలను ఎంచుకుంటూ ఆయన దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే టాక్ వినిపిస్తోంది.

సురేశ్ బాబు .. మధుర శ్రీధర్ సంయుక్తంగా ఒక సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నారట. కేవీఆర్ మహేంద్ర అనే యువ దర్శకుడు చెప్పిన ఒక విభిన్నమైన కథ నచ్చడంతో, ఈ నిర్మాతలిద్దరూ ముందుకొచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకి 'దొరసాని' అనే టైటిల్ ను దర్శకుడు ఖరారు చేసుకున్నాడని చెబుతున్నారు. కథా పరంగా ఈ సినిమాను కొత్త హీరో .. హీరోయిన్లతో చేస్తే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు, హీరోగా ఆనంద్ దేవరకొండను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. కథానాయిక ఎవరనే విషయంతో పాటు మిగతా వివరాలను త్వరలోనే వెల్లడి చేస్తారట.     
Go Back to Shorts
aanand

More Telugu News