Deepika Padukone: రణబీర్ నాకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.. అందుకే దూరమయ్యా: దీపికా పదుకునే

  • నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే అనుబంధానికి విలువ ఉండదు
  • రణబీర్ నుంచి విడిపోయాక మానసికంగా కుంగిపోయా
  • ఆ తర్వాత నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడ్డా
యంగ్ హీరో రణబీర్ కపూర్ కు బాలీవుడ్ లో ప్లేబోయ్ ఇమేజ్ ఉంది. సోనమ్ కపూర్, దీపికా పదుకునే, కత్రినా కైఫ్, ఇప్పుడు అలియా భట్.. ఇలా చెప్పుకుంటూ పోతే రణబీర్ వ్యవహారాల జాబితా పెద్దదే. 2007లో రణబీర్, దీపికా పదుకునేల మధ్య అఫైర్ నడిచింది. అయితే ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. తాము ఎందుకు విడిపోయామో దీపిక తాజాగా వివరించింది.

ఒక అనుబంధంలో ఉన్నప్పుడు తన పార్ట్ నర్ ను తానెప్పుడూ మోసం చేయలేదని దీపిక తెలిపింది. నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే, ఆ అనుబంధానికి విలువ ఏముంటుందని ప్రశ్నించింది. రణబీర్ తనకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని... మరో అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడ్డాడని చెప్పింది. అయితే, మరోసారి ఫూల్ కాకూడదనే ఉద్దేశంతోనే అతనికి దూరమయ్యానని తెలిపింది. విడిపోయిన తర్వాత మానసికంగా కుంగిపోయానని... ఆ తర్వాత ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటపడ్డానని చెప్పింది. 
Deepika Padukone
ranbeer kapoor
affair

More Telugu News