Chittoor: 'సైరా నరసింహారెడ్డి' అంటున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్!

  • రోజుకో వేషంతో నిరసన
  • నేడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా రాక
  • కరవాలానికి పని చెబుతానని వ్యాఖ్య
రాష్ట్ర విభజన తరువాత ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ రోజుకో వేషం వేసుకుని వచ్చి పార్లమెంట్ ముందు వినూత్న నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ నరమల్లి శివప్రసాద్ నేడు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వేషంలో వచ్చి 'సైరా... నరసింహారెడ్డి' అంటూ ప్రధానికి హెచ్చరికలు జారీ చేశారు.

వెంటనే రాష్ట్రానికి ఇస్తామన్న హామీలన్నీ నెరవేర్చాలని, లేకుంటే నరసింహారెడ్డి తన కరవాలానికి పని చెబుతాడని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు. కాగా, గతంలో ఓ మహిళగా, స్కూలు బాయిగా, అన్నమయ్యగా, మత్స్యకారుడిగా, రజకుడిగా పలు రకాల వేషాల్లో శివప్రసాద్ పార్లమెంట్ ముందు నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.
Chittoor
MP Sivaprasad
Uyyalavada Narasimhareddy
Parliament
Protest

More Telugu News