srireddy: శ్రీరెడ్డిపై విరుచుకుపడ్డ ప్రముఖ దర్శకుడు భారతీరాజా

  • శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయి
  • పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేయడం సరైంది కాదు
  • ఎదుటివారిపై బురదచల్లే కార్యక్రమాన్ని ఆపేయాలి
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆరోపణలు చేసి కలకలం రేపిన నటి శ్రీరెడ్డి... పలువురు కోలీవుడ్ ప్రముఖులపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మురుగదాస్, సుందర్, నటుడు శ్రీరామ్, లారెన్స్ తదితరులు అవకాశాలు ఇస్తామంటూ ఆశ చూపి, తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో పలువురు కోలీవుడ్ ప్రముఖులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఆమెపై విరుచుకుపడ్డారు. శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయని... అయినప్పటికీ, వాటితో ప్రచారం పొందాలని ఆమె అనుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. సినిమావారందరినీ శ్రీరెడ్డి తప్పుపట్టడం సరికాదని చెప్పారు. ఎదుటివారిపై బురదచల్లే కార్యక్రమాన్ని ఇప్పటికైనా ఆపేయాలని సూచించారు. 
srireddy
bharathi raja
tollywood
kollywood

More Telugu News