Pawan Kalyan: కాలు బెణకి ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్!

  • భీమవరంలోని ఎన్డీ ఫంక్షన్ హాల్ లో బస చేసిన పవన్
  • అక్కడి గచ్చు తడిగా ఉండటంతో స్కిడ్ అయిన వైనం
  • పవన్ ని పరీక్షించిన వైద్యులు
పశ్చిమగోదావరి జిల్లాలో పోరాట యాత్రలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కుడి కాలు బెణకింది. భీమవరంలోని ఎన్డీ ఫంక్షన్ హాల్ లో బస చేసిన పవన్ ని కలిసేందుకు పార్టీ కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడేందుకు పవన్ వెళ్తున్న సమయంలో అక్కడి గచ్చు తడిగా ఉండటంతో ఆయన కాలు జారడం..బెణకడం జరిగిందని ‘జనసేన’ ఓ ప్రకటనలో పేర్కొంది.

వెంటనే, వైద్యులు పరీక్షించారని, పవన్ కాలుకి క్యాప్ వేశారని, కాలు నొప్పి లేకుండా ఉండేందుకు పెయిన్ కిల్లర్స్ వాడాలని, ఆయనకు స్వల్ప విశ్రాంతి అవసరమని సూచించినట్టు తెలిపింది. కాగా, కాలు నొప్పితో బాధపడుతున్న పవన్, తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడలేకపోయారు.
Pawan Kalyan
sprain

More Telugu News