Rajya Sabha: ఏపీ ప్రజలకు ఈరోజు ‘ఓ బ్లాక్ డే’: సుజనా చౌదరి

  • నాలుగేళ్లుగా చెబుతున్న మాటలే బీజేపీ మళ్లీ చెప్పింది
  • పీయూష్ గోయల్ కొత్త సినిమాను మొదలు పెట్టారు
  • బీజేపీ నేతలు ఏ ఒక్క నిజం చెప్పలేదు
విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా బీజేపీ నేతలు ఏ ఒక్క నిజం చెప్పలేదని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా చెబుతున్న మాటలనే బీజేపీ నేతలు మళ్లీ చెప్పారని, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మాదిరి వ్యవహరించారని అన్నారు.

ముఖ్యంగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కొత్త సినిమాను మొదలు పెట్టారని, ఓ ప్రశ్న అడిగితే..మరో సమాధానం చెప్పారని విమర్శించారు. ఏపీ గురించి కేంద్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదని, రాజ్యసభలో తాము అడిగిన ప్రశ్నలకు ఏవేవో సమాధానాలు చెప్పి తప్పించుకున్నారని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలకు ఈరోజు ‘ఓ బ్లాక్ డే’ అని, ప్రజాస్వామ్య పద్ధతిలో సభను నిర్వహించలేదని అన్నారు. సభ నిబంధనలు తెలియకుండా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడారని విమర్శించారు.
Rajya Sabha
Sujana Chowdary

More Telugu News