Rajya Sabha: 14వ ఆర్థిక సంఘం అలా చెప్పినట్టు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా: సీఎం రమేశ్

  • ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందా?
  • అలా చెబితే చూపించండి
  • నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతా
‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడైనా చెప్పిందా? అలా చెబితే చూపించండి?’ అంటూ బీజేపీ నేతలను టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రశ్నించారు. విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పినట్టు నిరూపిస్తే ఇప్పుడే తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని భావోద్వేగంతో ప్రసంగించారు.

ఏపీకి ప్రత్యేకహోదాకు సమానంగా ప్రయోజనాలు అందిస్తామంటేనే ప్యాకేజ్ కు ఒప్పుకున్నామని అన్నారు. ప్యాకేజ్ కింద ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? ఏపీ ప్రజలంటే ఎందుకంత నిర్లక్ష్యం? అని ప్రశ్నించిన సీఎం రమేశ్, ప్రాంతీయ పార్టీలను కూడగడతారనే చంద్రబాబును లక్ష్యం చేసుకున్నారని అన్నారు. సభలో అసత్య ప్రచారాలు చేయడం తగదని బీజేపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. 
Rajya Sabha
CM Ramesh

More Telugu News