nirmalananda: ప్రముఖ సాహితీవేత్త నిర్మలానంద మృతి

  • హైదరాబాద్ లో రేపు ఆయన అంత్యక్రియలు
  • ముప్పై ఐదేళ్లుగా సాహితీ సేవలందించిన నిర్మలానంద
  • ఆయన మృతిపై పలువురు సంతాపం
హిందీ సహా పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించిన ప్రముఖ సాహితీవేత్త నిర్మలానంద (84) ఈరోజు మృతి చెందారు. హైదరాబాద్ లో రేపు ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయాన్ని నిర్మలానంద కుటుంబసభ్యులు తెలిపారు. ముప్పై ఐదేళ్లుగా సాహితీ సేవలందించిన నిర్మలానంద మృతిపై జనసాహితి నేతలు కొత్తపల్లి రవిబాబు, దివికుమార్ తదితరులు సంతాపం తెలిపారు. కాగా, మహాకవి శ్రీశ్రీ రచించిన ‘మహాప్రస్థానం’ను హిందీలోకి నిర్మలానంద అనువదించారు.
nirmalananda
demise

More Telugu News