Andhra Pradesh: ఏపీకి హోదా ఇస్తే.. తెలంగాణకు కూడా ఇవ్వాల్సిందే: హరీష్ రావు

  • ఏపీకి హోదా ఇస్తే పరిశ్రమలన్నీ అక్కడకు వెళ్లిపోతాయి
  • తెలంగాణ ప్రజలు రోడ్డున పడతారు
  • తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పష్టతను ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే, తెలంగాణకు కూడా ఇవ్వాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే, పరిశ్రమలన్నీ అక్కడకు తరలిపోతాయని, తెలంగాణ ప్రజలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాకు తాము వ్యతిరేకం కాదని... వారికి హోదా ఇచ్చినప్పుడు తమకు కూడా ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పష్టతను ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మొన్న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కూడా ఏపీకి హోదాకు సంబంధించి తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే, హరీష్ రావు ఈమేరకు డిమాండ్ చేశారు.
Andhra Pradesh
special status
harish rao
Telangana
congress

More Telugu News