Supreme Court: జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

  • నిషేధం విధించిన గ్రీన్ ట్రైబ్యునల్ 
  • అది ప్రజల ప్రాథమిక హక్కని స్పష్టీకరణ
  • నిషేధం విధించడాన్ని తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం 
దేశరాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ప్రజలు ధర్నాలు, ఆందోళనలు చేపట్టకుండా జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా ధర్నాలు, నిరసనలు తెలపడం పౌరుల ప్రాథమిక హక్కని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. జంతర్ మంతర్ తో పాటు సెంట్రల్ ఢిల్లీలోని బోట్ క్లబ్ ప్రాంతంలోనూ శాంతియుత నిరసన ప్రదర్శనలకు అనుమతించాలని అధికారుల్ని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ ల ధర్మాసనం ఆదేశించింది.

ఈ ప్రాంతంలో ఆందోళనల సందర్భంగా పోలీసులు ప్రతిసారీ నిషేధం విధించడాన్ని సుప్రీం తప్పుపట్టింది. శబ్దకాలుష్యం కారణంగా 2017, అక్టోబర్లో జాతీయ హరిత ట్రైబ్యునల్ జంతర్ మంతర్ వద్ద ఆందోళనలను నిషేధించింది. అలాగే బోట్ క్లబ్ ప్రాంతంలో పచ్చదనం దెబ్బతింటోందన్న ఉద్దేశంతో 1993లో ఇక్కడ ధర్నాలపై నిషేధం వేటు వేసింది. దీంతో ఆందోళనకారులంతా ఇప్పటివరకూ ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్
 లో రోజుకు రూ.50,000 చెల్లించి ధర్నాలు, నిరసనల్లో పాల్గొంటున్నారు.
Supreme Court
jantarmantar
New Delhi

More Telugu News