KTR: కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • కేటీఆర్ కు వెల్లువెత్తుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు
  • మంచి స్నేహితుడు, గొప్ప నాయకుడు అన్న మహేష్ బాబు
  • కేటీఆర్ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలన్న ఉత్తమ్
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు 42వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు కూడా ఆయనకు ట్విట్టర్ ద్వారా గ్రీటింగ్స్ తెలిపారు. 'మంచి స్నేహితుడు, గొప్ప నాయకుడు. హ్యాపీ బర్త్ డే కేటీఆర్' అంటూ గ్రీట్ చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయాలను పక్కనపెట్టి, కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. '42వ జన్మదినం సందర్భంగా కేటీఆర్ కు నా బెస్ట్ విషెస్. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఉండాలని కోరుతున్నా' అంటూ ట్వీట్ చేశారు.
KTR
Uttam Kumar Reddy
Mahesh Babu
birthday

More Telugu News