ooman chandi: అనంతపురంలో ఊమన్ చాందీ.. బైకు ర్యాలీతో హోరెత్తిన పట్టణం!

  • ప్రత్యేక హోదాకు సోనియా, రాహుల్ లు కట్టుబడి ఉన్నారు
  • ఏపీకి స్పెషల్ స్టేటస్ చాలా అవసరం
  • సీడబ్ల్యూసీ సమావేశంలో కూడా ఇదే చర్చించారు
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జి ఊమన్ చాందీ అన్నారు. ఈరోజు ఆయన అనంతపురం పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. యూత్ కాంగ్రెస్ నేతలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చాందీ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని... ఇదే విషయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించారని తెలిపారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సోనియా, రాహుల్ లు కట్టుబడి ఉన్నారని చెప్పారు. అనంత పర్యటన సందర్భంగా, జిల్లాలోని అన్ని నియోజకవర్గ నేతలతో చాందీ సమీక్ష నిర్వహించారు.
ooman chandi
Anantapur
raghuveera reddy

More Telugu News