Parliament: 'అదిగో అల్లదిగో... మోసాల దిగ్గజమూ మోడీ ఉన్న స్థలమూ..' అన్నమయ్య పాటకు ఎంపీ శివప్రసాద్ పేరడీ!

  • రెండు రోజుల విరామం అనంతరం పార్లమెంట్ ప్రారంభం
  • అన్నమయ్య వేషంలో వచ్చి పాటలు పాడిన చిత్తూరు ఎంపీ
  • హోదా ఇవ్వాల్సిందేనంటూ మండిపాటు
కేంద్రంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయిన తరువాత, రెండు రోజుల విరామానంతరం ఈ ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకాగా, చిత్తూరు ఎంపీ, టీడీపీ నేత శివప్రసాద్, మరోసారి తనదైన శైలిలో ఓ వేషం వేసుకుని వచ్చి నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

నేడు అన్నమయ్య వేషధారణలో పార్లమెంట్ కు వచ్చిన ఆయన, అన్నమయ్య కీర్తనలకు పేరడీలు పాడారు. "అదిగో అల్లదిగో.." పాటను గుర్తు చేస్తూ, "అదిగో అల్లదిగో పార్లమెంటు భవనం... మోసాల దిగ్గజమూ మోదీ ఉన్న స్థలమూ... అదిగో అల్లదిగో పార్లమెంటూ భవనం" అంటూ పాటలు పాడారు. వెంకటేశ్వరునికి పరమ భక్తుడైన అన్నమయ్య, ఎన్నో వేల పాటలను రచించిన పదకవితాపితామహుడు, తన స్వామి కాళ్ల వద్ద ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మాటిచ్చి, ఆపై దాన్ని తుంగలో తొక్కిన నరేంద్ర మోదీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిందేనంటూ కొన్ని పేరడీ పాటలను ఆయన పాడారు.
Parliament
Lok Sabha
Chittoor MP
Sivaprasad

More Telugu News