Pawan Kalyan: నేనైతే జగన్ లా అసెంబ్లీ నుంచి పారిపోయేవాడిని కాదు: పవన్ కల్యాణ్

  • ప్రజాస్వామ్యంలో మాట్లాడాలి, పోరాడాలి
  • మంచి అవకాశం జగన్ దుర్వినియోగం చేసుకున్నారు
  • మాక్కూడా ఓ పది మంది ఎమ్మెల్యేలుంటేనా అసెంబ్లీని ఆపేసేవాడిని
గత ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసుంటే బాగుండేదని, ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే టీడీపీకి మద్దతుగా నిలిచానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, తమకు కూడా ఓ పది మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలా అసెంబ్లీ నుంచి పారిపోయేవాడిని కాదని, అసెంబ్లీని స్తంభింపజేసేవాడినని, ప్రజాస్వామ్యంలో మాట్లాడాలని, పోరాడాలని అన్నారు. బంగారం లాంటి అవకాశాన్ని జగన్ దుర్వినియోగం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఉండవల్లి రైతుల సమస్యలపై తాను మాట్లాడటానికి గల కారణాన్ని చెప్పారు. వాళ్లు కూడా తోటి మనుషులేనని, ఆ భావనతోనే వారి సమస్యల గురించి మాట్లాడాను తప్ప, ఓట్ల కోసం కాదని అన్నారు.
Pawan Kalyan
Jagan

More Telugu News