Pawan Kalyan: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ రాజధానికి భూములిచ్చిన రైతుల నిరసన!
- పవన్ వ్యాఖ్యల వల్ల మా భూముల విలువ పోతోంది
- ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతుల నిరసన ర్యాలీ
- మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధానికి భూములు ఇచ్చిన ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. పవన్ చేస్తున్న వ్యాఖ్యల వల్ల తమ భూముల విలువ పోతోందని మండిపడ్డారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి రైతులు వినతిపత్రం సమర్పించారు. రాజధాని కోసం తొంభై ఎనిమిది శాతం మంది రైతులు భూములు ఇచ్చారని, భూములు ఇవ్వని రెండు శాతం మంది రైతుల కోసం వచ్చిన పవన్, రాజధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారా? అని వారు ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యల కారణంగా తమ భూముల ధరలు పడిపోతాయంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు.