KTR: మంత్రి కేటీఆర్ కు మరో ప్రత్యేక ఆహ్వానం

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు మరో ప్రత్యేక ఆహ్వానం అందింది. అమెరికాలో జరగనున్న గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ సమిట్ లో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్ ను ఆహ్వానించారు. ఈ మేరకు కేటీఆర్ కు కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఎడ్మండ్ జి బ్రౌన్ ఓ లేఖ రాశారు. సెప్టెంబర్ 12 నుంచి 14 తేదీ వరకు శాన్ ఫ్రాన్సిస్కోలో జరగనున్న ఈ సదస్సులో పాల్గొని ‘ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ అండ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్స్’ అనే అంశంపై ప్రసంగించాలని కేటీఆర్ ని ఈ లేఖలో కోరారు.

ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి హాజరవుతున్న ప్రతినిధులకు వాతావరణ మార్పులకు ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్యక్రమాలపై చేసే ప్రసంగం ఉపయుక్తంగా ఉంటుందని ఎడ్మండ్ జి బ్రౌన్ తెలిపారు. ఈ ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి, వాతావరణ అనుకూల కార్యక్రమాల గురించి కూడా వివరించాల్సిందిగా కోరారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల పైన చైతన్యవంతం చేసే దిశగా ఈ సదస్సు ఉంటుందని, దీని ద్వారా వివిధ ప్రభుత్వాలను, పాలసీ మేకర్స్ ను సానుకూలంగా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ ప్రభుత్వాల నుంచి ప్రతినిధులతో పాటు వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్న వ్యక్తులు హాజరవుతారని ఈ ఆహ్వానంలో ఎడ్మండ్ జి బ్రౌన్ పేర్కొన్నారు.
Go Back to Shorts
KTR
america
edmand g brown

More Telugu News