modi: మోదీ నిజస్వరూపం బయటపడింది: మంత్రి గంటా

షార్ట్స్‌లో చూడండి
అవిశ్వాస తీర్మానంపై చర్చ ద్వారా ప్రధాని మోదీ నిజస్వరూపం బయటపడిందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ మర్చిపోయారని, తిరుమల వెంకన్న సాక్షిగా ‘హోదా’ ఇస్తానని చెప్పిన మాటను పక్కనబెట్టారని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న వాటిని తప్పకుండా నెరవేరుస్తామంటూ లోక్ సభలో ఏపీపై మోదీ చాలా వ్యంగ్యంగా మాట్లాడారని దుయ్యబట్టారు. లోక్ సభలో తమ ఎంపీలు మాట్లాడిన తీరు చాలా బాగుందని, ఏపీ ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిపి పోరాడాలని పిలుపు నిచ్చారు.
Go Back to Shorts
modi
ganta

More Telugu News