కానిస్టేబుల్ సలీమ్ అహ్మద్ ను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదుల ఎన్ కౌంటర్!
- కశ్మీర్లోని కుల్గాంలో ఎన్ కౌంటర్
- ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
- కానిస్టేబుల్ ను చంపిన ప్రాంతానికి దగ్గరలోనే ఎన్ కౌంటర్
మొహల్లా ప్రాంతంలోని ఖుద్వనిలోని ఓ ఇంటిలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని తెలుసుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఈ ఎన్ కౌంటర్ చేశాయి. కేంద్ర రిజర్వ్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు.