Hyderabad: లక్డీకపూల్ సెంట్రల్ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం!

  • అకౌంట్స్ విభాగంలో మంటలు
  • షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు
  • మూడు గంటలు శ్రమించిన ఫైర్ సిబ్బంది
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న లక్డీకపూల్ లోని సెంట్రల్ హోటల్ లో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోటల్ లోని అకౌంట్స్ విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకోగా, అవి హోటల్ మొత్తం వ్యాపించాయి. దీంతో హోటల్ యాజమాన్యం అతిథులను అందరినీ బయటకు పంపించి వేసి అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చింది.

విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన వచ్చిన మూడు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనలో స్వల్ప ఆస్తి నష్టం మినహా ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు వెల్లడించారు. మంటలను హోటల్ లోని ఇతర గదులకు వ్యాపించకుండా చర్యలు చేపట్టామని, మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశామని తెలిపారు.
Hyderabad
Lakdi-ka-pool
Fire Accident
Central

More Telugu News