somu veeraj: ఏపీ ప్రజలను ఆదుకున్న ఏకైక పార్టీ బీజేపీయే!: సోము వీర్రాజు

  • ఏపీకి అన్యాయం చేసింది కాంగ్రెస్, టీడీపీయే
  • ‘పోలవరం’పై  చంద్రబాబు ఏనాడూ మాట్లాడలేదు
  • ఏపీకి వచ్చిన ఉపాధి హామీ నిధులతో 2 పోలవరం ప్రాజెక్టులు కట్టొచ్చు
ఏపీ ప్రజలను ఆదుకున్న ఏకైక పార్టీ బీజేపీ అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు   అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి, ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రెస్, టీడీపీయేనని విమర్శించారు. పార్లమెంట్ ను స్తంభింపజేసి, ప్రజాధనాన్ని కాంగ్రెస్, టీడీపీ దుర్వినియోగం చేస్తున్నాయని, ‘పోలవరం’పై చంద్రబాబు ఏనాడూ మాట్లాడలేదని, ఏపీకి వచ్చిన ఉపాధిహామీ నిధులతో రెండు పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన గల్లా జయదేవ్.. అసెంబ్లీలో జగన్ మాట్లాడిన అంశాలే నిన్న లోక్ సభలో మాట్లాడారని విమర్శించారు.

టీడీపీ పరిస్థితి వైసీపీ వలలో చిక్కుకున్న పక్షిలా మారింది

టీడీపీ పరిస్థితి వైసీపీ వలలో చిక్కుకున్న పక్షిలా మారిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం బెడిసికొట్టిందని, ప్రజలలో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై బురదజల్లాలని టీడీపీ చూసిందని విమర్శించారు. కాంగ్రెస్-టీడీపీ మైత్రీ బంధానికి పార్లమెంట్ వేదికగా నిలిచిందని, నిన్నటి సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధిపై బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో రాజీపడదని, ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని అన్నారు.
somu veeraj
bjp

More Telugu News