roja: 2019లో టీడీపీ గల్లంతు కావడం ఖాయం: రోజా

  • టీడీపీ డ్రామాలను ప్రజలంతా గమనించారు
  • టీడీపీ నేతల పోరాటంలో చిత్తశుద్ధి లేదు
  • ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది వైసీపీ మాత్రమే
తెలుగుదేశం పార్టీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. నిన్న టీడీపీ, ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన డ్రామా... ఏపీ ప్రయోజనాల గురించి వారు ఎంత తక్కువగా ఆలోచిస్తున్నారో కళ్లకు కట్టినట్టు చూపిస్తోందని ఆమె మండిపడ్డారు.

రాష్ట్రం గురించి టీడీపీ నేతలు చేస్తున్న పోరాటంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం తేలిపోయిందని చెప్పారు. టీడీపీ డ్రామాలను ప్రజలంతా గమనించారని... 2019లో ఆ పార్టీ గల్లంతవడం ఖాయమని చెప్పారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి, ప్రత్యేక హోదా గురించి తొలి నుంచి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ అని చెప్పారు. 
roja
galla jayadev
special status
Telugudesam

More Telugu News