Chandrababu: మెజార్టీకి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటమిది: ఢిల్లీలో చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీని మించిన రాజధానిని ఏపీకి ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ... మాట తప్పారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. జాతీయ పార్టీతో కలసి ఉంటేనే ఏపీ ప్రయోజనాలను సాధించుకోగలమనే నమ్మకంతో ఎన్నికల సమయంలో బీజేపీతో చేతులు కలిపామని... ఇరు పార్టీలు కలసి ప్రచారాన్ని నిర్వహించామని, కలసికట్టుగా విజయం సాధించామని చెప్పారు. తిరుమల వెంకన్న సాక్షిగా మోదీ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఏదీ నెరవేర్చలేదని విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న పోరాటం బీజేపీ, టీడీపీ మధ్య కాదని... మెజార్టీకి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటమని చంద్రబాబు అన్నారు. విభజన చట్టాలన్నింటినీ అమలు చేస్తామని అమరావతి శంకుస్థాపన సందర్భంగా మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజార్టీ వచ్చిందని లోక్ సభలో మోదీ చెప్పారని... ప్రజా తీర్పును తాము కూడా గౌరవిస్తామని చెప్పారు. 15 ఏళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టింది తామేనని అన్నారు. 
Go Back to Shorts
Chandrababu
delhi
modi

More Telugu News