go samrakshak: ఆవులను తరలిస్తున్నాడని.. కొట్టి చంపేశారు!

షార్ట్స్‌లో చూడండి
గోసంరక్షణ పేరుతో జరుగుతున్న హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఈ దాడులపై ఎన్నో సార్లు స్పందించినా... పరిస్థితిలో మార్పు రావడం లేదు. తాజాగా బీజేపీ పాలిత రాజస్థాన్ రాష్ట్రంలో మరో ఘటన చోటు చేసుకుంది. ఆవులను అక్రమంగా తరలిస్తున్నాడనే అనుమానంతో, ఓ వ్యక్తిని కొట్టి చంపేశారు.

వివరాల్లోకి వెళ్తే, హర్యాణాకు చెందిన అక్బర్ ఖాన్ అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి నిన్న రాత్రి తన స్వగ్రామం కోల్గావ్ నుంచి ఆవులను తీసుకుని, రాజస్థాన్ లోని రామ్ గఢ్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ వారు ఆవులను తీసుకుని నడుచుకుంటూ వెళ్తుండగా, అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో స్థానికులు వారిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో, అక్బర్ ఖాన్ అక్కడికక్కడే మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అక్బర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు. 
Go Back to Shorts
go samrakshak
murder
cow

More Telugu News