Balakrishna: పట్టు వదలని వినాయక్ .. కొనసాగుతోన్న ప్రయత్నాలు!

  • బాలకృష్ణతో చేయాలనుకున్న వినాయక్ 
  • పవర్ ఫుల్ కథలపై కసరత్తు 
  • బోయపాటి తరువాత సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్
'ఎన్టీఆర్' బయోపిక్ కోసం బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లేలోగా ఆయనతో ఒక సినిమా చేయాలని నిర్మాత సి.కల్యాణ్ భావించాడు. ఈ సినిమాకి దర్శకుడిగా వినాయక్ కూడా సిద్ధమైపోయాడు. అయితే సరైన కథను సెట్ చేయలేకపోవడంతో, 'ఎన్టీఆర్' బయోపిక్ పనులతో బాలకృష్ణ బిజీ అయ్యారు. ఆ తరువాత సినిమా అయినా ఆయనతో చేయాలనే ఉద్దేశంతో వున్న వినాయక్, యువ రచయితల దగ్గర వున్న చాలా కథలను విన్నాడట.

బాలకృష్ణకి ఫలానా కథ సెట్ అవుతుందని అనిపించిన వెంటనే ఆయనను కలిసి వినిపిస్తూ వచ్చాడని అంటున్నారు. అయినా ఆ కథలు అంత సంతృప్తిని కలిగించకపోవడంతో, నెక్స్ట్ మూవీ చేసే ఛాన్స్ ను బోయపాటికి ఇచ్చారు బాలకృష్ణ. అయినా వినాయక్ నిరాశ పడకుండగా, బాలకృష్ణ మాస్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని .. తన మార్కును మిస్ కాకుండా ఒక కథను తయారు చేయించే పనిలో వున్నాడట. ఈ కథ ఓకే అయితే .. బోయపాటి ప్రాజెక్టు తరువాత బాలకృష్ణ ఈ సినిమా చేసే ఛాన్స్ వుందని అంటున్నారు.    
Balakrishna
vinayak

More Telugu News