Chandrababu: ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • పలువురు నేతలతో భేటీ కానున్న చంద్రబాబు
  • అవిశ్వాసానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలపనున్న సీఎం
  • అనంతరం జాతీయ మీడియాతో సమావేశం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఈ ఉదయం ఆయన ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు నేతలతో ఆయన భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్ సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలపనున్నారు. లోక్ సభలో అవిశ్వాసం, తదనంతర పరిణామాలపై జాతీయ మీడియాతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఈ సమావేశంలో ఎండగట్టనున్నారు.
Chandrababu
delhi

More Telugu News