Chandrababu: మోదీ కన్నా కాంగ్రెస్ నయం: చంద్రబాబు నోటి వెంట అనూహ్య వ్యాఖ్యలు!

  • నరేంద్ర మోదీది దుర్మార్గపు వైఖరి
  • ప్రధాని వ్యాఖ్యలు బాధ కలిగించాయి 
  • అవిశ్వాసానికి సహకరించినందుకు కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ, నరేంద్ర మోదీ ప్రదర్శిస్తున్న దుర్మార్గపు వైఖరిని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వమే నయమన్న అభిప్రాయం కలుగుతోందని చంద్రబాబునాయుడు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ ఏపీ ప్రజల దేశభక్తిని శంకిస్తూ మాట్లాడటాన్ని ఆక్షేపించిన ఆయన, అవిశ్వాస తీర్మానానికి సహకరించిన కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకూ కృతజ్ఞతలు తెలిపారు.

లోక్ సభలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ ఉందని, అవిశ్వాసం వీగిపోతుందన్న సంగతి తమకు తెలుసునని, అయినా, సమస్యను మరోసారి వాళ్ల దృష్టికి తీసుకెళ్లేందుకే అవిశ్వాసం పెట్టామని అన్నారు. తాము  అహంకారంతో అవిశ్వాసం పెట్టామని వ్యాఖ్యానించడం బాధ కలిగించిందని, తనదేమీ అహంకారం కాదని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడ న్యాయం చేశారని ప్రశ్నించిన ఆయన, 5 కోట్ల మంది ప్రజలను చులకనగా చూస్తున్నందుకు తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
Chandrababu
Congress
Narendra Modi
Telugudesam

More Telugu News