Chandrababu: దేశం మొత్తాన్ని కదిలిస్తున్న సమయంలో వాళ్లిద్దరూ ఎక్కడున్నారో.. తెలుసా?: చంద్రబాబు

  • ఒకాయన దేశం మొత్తాన్ని ఏకం చేస్తానన్నారు
  • ఇంకో ఆయన పోరాటం అంటూ హడావుడి చేశారు
  • చర్చజరుగుతుంటే వారిద్దరూ కనిపించరే..!
అవిశ్వాస తీర్మానం పెట్టి దేశం మొత్తాన్ని కదిలిస్తున్న సమయంలో జగన్, పవన్ ఎక్కడున్నారో తెలుసా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఒకరు కోర్టులో.. మరొకరు ట్వీట్లలో అని ఎద్దేవా చేశారు. రాజీనామాల పేరుతో హల్‌చల్ చేసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు చూద్దామన్నా కనిపించలేదని, పోరాటం అంటూ హడావుడి చేసిన జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

తీర్మానం పెడితే దేశం మొత్తాన్ని ఏకం చేస్తానన్న పెద్దమనిషి ఎక్కడికి పోయాడని బాబు నిలదీశారు. మోదీ ప్రసంగంపై స్పందిస్తూ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అధికార పక్ష నేతలు లోక్‌సభలో చర్చకు అడ్డుపడ్డారని, సంఖ్యాబలం లేదని ఎగతాళి చేశారని అన్నారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి తప్పితే రాజకీయాలు మాట్లాడకూడదని హితవు పలికారు.
Chandrababu
Narendra Modi
Pawan Kalyan
YS jagan

More Telugu News