modi: ప్రధాని మోదీ ప్రపంచంలోనే గొప్పనటుడు: ఎంపీ కేశినేని నాని వ్యంగ్యం

  • ప్రధాని అవాస్తవ గణాంకాలు, వివరణలు చెప్పారు
  • గొప్ప నటన, నాటకీయత, హావభావాలతో ప్రసంగించారు
  • ప్రధాని ప్రసంగం బాలీవుడ్ చిత్రాన్ని తలపించింది
ప్రధాని మోదీ ప్రపంచంలోనే గొప్పనటుడు అని టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యంగ్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మోదీ ప్రసంగం ముగిసిన అనంతరం, రైట్ టు రిప్లై కింద కేశినేని నాని మాట్లాడారు. ప్రధాని అవాస్తవ గణాంకాలు, వివరణలు చెప్పారని, మోదీ గొప్ప నటన, నాటకీయత, హావభావాలతో ప్రసంగించారని, ప్రధాని ప్రసంగం బ్లాక్ బస్టర్ బాలీవుడ్ చిత్రాన్ని తలపించిందని దుయ్యబట్టారు. ఈ ప్రపంచంలోనే మోదీ గొప్ప నటుడని, 2014కు ముందు కూడా మోదీ ఇలానే నటించారని, దాదాపు గంటన్నర సేపు సమ్మోహనపరిచే రీతిలో ఆయన ప్రసంగించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
modi
kesineni

More Telugu News