butta renuka: ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజలకు నమ్మకం పోతుంది: బుట్టా రేణుక

  • నాడు పార్లమెంట్ తలుపులు మూసి విభజించారు
  • ఏపీకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం తగదు
  • పార్లమెంటరీ వ్యవస్థ ప్రమాదంలో పడిపోతుంది
 ఏపీకి ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నిలబెట్టుకోకపోతే, పార్లమెంటరీ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం పోతుందని ఎంపీ బుట్టా రేణుక విమర్శించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నాడు పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా లేమని చెబుతోందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పార్లమెంటరీ వ్యవస్థ ప్రమాదంలో పడిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గానికి ట్రిపుల్ ఐటీ ఇచ్చినప్పటికీ, కాంచీపురం నుంచే ఇందుకు సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్నాయని అన్నారు.  
butta renuka
Lok Sabha

More Telugu News