modi: మోదీని రాహుల్ ఆలింగనం చేసుకున్న తీరు గౌరవప్రదంగా లేదు: స్పీకర్ సుమిత్రా మహాజన్

  • అప్పుడు సభలో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు
  • సభలోని సభ్యులంతా సంప్రదాయాలు పాటించాలి
  • ప్రధాని స్థానంలో ఎవరున్నా, ఆ స్థానాన్ని గౌరవించాలి
ప్రధాని మోదీన రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకున్న తీరు గౌరవప్రదంగా లేదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా ప్రసంగిస్తున్న బీజేపీ ఎంపీ రాజ్ నాథ్ సింగ్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. పోడియం వద్దకు వెళ్లి టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో లోక్ సభను 4.30 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.

 సభ తిరిగి ప్రారంభమైన అనంతరం, సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, సభలోని సభ్యులంతా సంప్రదాయాలు పాటించాలని, ప్రధాని స్థానంలో ఎవరున్నా, ఆ స్థానాన్ని గౌరవించాలని సూచించారు. మోదీని రాహుల్ ఆలింగనం చేసుకున్న సమయంలో అసలు సభలో ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదని అన్నారు.
modi
sumitra
rahul

More Telugu News