Sonia Gandhi: తల్లీ! రాష్ట్రాన్ని విభజించి.. రెడ్లకు తీరని అన్యాయం చేశావు!: సోనియాతో జేసీ

  • లోక్ సభలో ఎంపీ జేసీకి ఎదురుపడ్డ సోనియాగాంధీ
  • సోనియాకు నమస్కారం చేసిన జేసీ
  • తనదైన శైలిలో సోనియాతో వ్యాఖ్యలు చేసిన జేసీ
లోక్ సభలో ‘అవిశ్వాసం’పై జరిగే చర్చకు ఎట్టి పరిస్థితిలోనూ హాజరయ్యే ప్రస్తకే లేదని చెప్పి.. చివరికి సీఎం చంద్రబాబు చేసిన ఫోన్ తో మెత్తబడ్డిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎట్టకేలకు ఈ చర్చకు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక్ సభలో ఈ రోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

సభలో జేసీ దివాకర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా సోనియాకు నమస్కారం చేసిన జేసీ, ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ‘తల్లీ, రాష్ట్రాన్ని విభజించి.. రెడ్లకు తీరని అన్యాయం చేశావు. తెలుగు రాష్ట్రాల్లో ‘కాంగ్రెస్’ను నమ్ముకున్న రెడ్లు నిలువునా మునిగారు’ అని జేసీ అనడంతో సోనియా నవ్వుకుంటూ ముందుకెళ్లారట.
Sonia Gandhi
jc

More Telugu News