venkatesh: 'ఎఫ్ 2' మూవీ గురించి అనిల్ రావిపూడి

  • వినోదమే ప్రధానంగా సాగే 'ఎఫ్ 2'
  • మొదటి షెడ్యూల్ పూర్తి 
  • రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు
తెలుగు తెరపై వరుస విజయాలతో దూసుకుపోతోన్న చాలా తక్కువ మంది దర్శకులలో అనిల్ రావిపూడి పేరు కూడా కనిపిస్తుంది. పటాస్ .. సుప్రీమ్ .. రాజా ది గ్రేట్ సినిమాలతో ఆయన విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన వెంకటేశ్ .. వరుణ్ తేజ్ హీరోలుగా ఒక మల్టీస్టారర్ ను రూపొందిస్తున్నాడు. పూర్తి వినోదభరితంగా సాగే ఈ సినిమాకి ఆయన 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశాడు.ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా నటిస్తుంటే, వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ కనిపిస్తుంది. తాజాగా ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. వెంకటేశ్ అద్భుతంగా చేశారనీ .. వరుణ్ తేజ్ ఎంతగానో సహకరించాడని అన్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎంతో సరదాగా సాగిపోయిందని తమన్నా సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే రెండవ షెడ్యూల్ ను మొదలెట్టడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నారు.  
venkatesh
thamannah
varun
mehreen

More Telugu News